అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో లింగార్చన

20-09-2026 | 10:10pm

ముకరంపుర, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అల్ఫోర్స్ విద్యాసంస్థ(Alphores Educational Institutions)ల్లో లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి(Dr. V. Narender Reddy) వారి పరివారంతో కలిసి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్, అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో వేములవాడ రిత్వికులచే నిర్వహించిన "లింగార్చన" కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లింగార్చన కార్యక్రమాన్ని మట్టితో లింగాలను తయారుచేసి పూజా కార్యక్రమం జరిగిందని చెప్పారు. రుత్వికులు స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ అందే విధంగా పూజా చేస్తారని వారు చెప్పారు. శివలింగానికి ఫల పంచామృతాలతో, పండ్ల రసాలతో రుత్వికులు అభిషేకం నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు