మద్ది గట్ల వినాయకుని లడ్డూ వేలం@రూ.1,70,016

20-09-2026 | 10:54pm

భూత్పూర్: మండల పరిధిలోని మద్దిగట్ల గ్రామం వినాయకుని లడ్డుకు రికార్డు స్థాయిలో వేలం పలికింది. గణేష్ ఉత్సవాల(Ganesh festivities)లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన లడ్డు వేలంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో కూకుట్ల రామ్ రెడ్డి తనయుడు కూకుంట్ల ఆనంద రెడ్డి అత్యధికంగా 1, 70 వేల, 016 రూపాయల వేలంపాడి లడ్డూలు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా లడ్డును దక్కించుకున్న ఆనంద్ రెడ్డిని గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించి అన్ని విధాల శుభాలు జరగాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు