రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఆత్మకూరు విద్యార్థులు ఎంపిక

20-09-2026 | 10:16pm

నాగిరెడ్డిపేట్ 20 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీ(State Level Wrestling Competitions)లకు ఆత్మకూరు విద్యార్థులు ఎంపికైనట్లు ఆత్మకూరు గ్రామస్తులు తెలిపారు. 70వ ఎస్.జి.ఎఫ్ రెజ్లింగ్ సెలక్షన్స్ ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో నిర్వహించినటువంటి డిస్టిక్ సెలక్షన్స్ లో నాగిరెడ్డిపేట్ మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇందులో అండర్ 14 గర్ల్స్ 39 కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ విజయలక్ష్మి, అండర్ 14 బాయ్స్ 41 కేజీ విభాగంలో సిల్వర్ మెడల్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ భానుప్రసాద్ అలాగే అండర్ 14 బాయ్స్ 35 కేజీ విభాగంలో సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ కే.స్వామి పథకాలు సాధించినట్లు గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని వార్తలు