పెళ్లి కాకపోయినా తల్లిని అవుతా!

23-09-2026 | 12:46pm

వివాహ బంధంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన హీరోయిన్

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతిహాసన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి సోహా అలీఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. వివాహం, జీవిత భాగస్వామి, మాతృత్వం, ఆరోగ్య సమస్యలపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. వివాహం విషయంలో తన ఆలోచనలు సంప్రదాయానికి భిన్నంగా ఉంటాయని శ్రుతిహాసన్ తెలిపారు. జీవితంలో పెళ్లి చేసుకోవడం తప్పనిసరి అనే భావన తనకు లేదని చెప్పారు. వివాహం కోసం భారీగా ఖర్చు చేసే డబ్బును అవసరంలో ఉన్న వారికి ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మాతృత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు

తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా శ్రుతిహాసన్ మాట్లాడారు. పీసీఓఎస్ (PCOS) కారణంగా గర్భం దాల్చడం కొంత కష్టమవుతుందని గతంలో వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం ఆ విషయంలో తన భయాలు కొంత తొలగిపోయాయని తెలిపారు. 

భవిష్యత్తులో తల్లిని కావాలనే కోరిక తనలో బలంగా ఉందని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాతే మాతృత్వం పొందాలనే పరిమిత ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. పెళ్లి లేకుండానే బిడ్డను దత్తత తీసుకునే విషయాన్ని కూడా తాను సానుకూలంగా చూస్తున్నానని వెల్లడించారు.ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు