కాకాతో స్పెషల్‌గా..!

18-11-2026 | 12:00am

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘కాకా’(Kaka) చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. చిరు టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం(Directed by Bobby Kolli) వహిస్తున్నారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్(Anaswara Rajan), నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తండ్రీ అనుబంధాలతో ముడిపడిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో చిరంజీవి రెండు భిన్న కోణాలున్న పాత్రల్లో అలరించనున్నారు.

తమన్ సంగీత దర్శకుడిగా, విజయ్ కార్తీక్ కన్నన్ డీవోపీగా పనిచేస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా 2027, జనవరి 13న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో అందాల తార రితికా సింగ్ ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తనదైన నటనతో పాటు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకునే రితికా సింగ్ ఈ పాటలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

చిరంజీవి సినిమాల్లో పాటలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటిది రితికా సింగ్ ప్రత్యేక గీతంలో కనిపించనుందనే వార్త సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది. ఈ పాటను ప్రత్యేకంగా తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ ముచ్చింతల్ ప్రాంతంలో ఓ ప్రత్యేక సెట్‌లో జరుగుతోందని సినీవర్గాల సమాచారం. ఇప్పటికే చిరంజీవి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొనగా, రితికా సింగ్ స్పెషల్ సాంగ్ ఆ అంచనాలకు మరింత ఊపునివ్వనుంది. 

మరిన్ని వార్తలు