తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సిరిపురం లావణ్య

17-11-2026 | 11:54pm

కరీంనగర్ సిటీ నవంబర్17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తనను నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అఖిలభారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సిరిపురం లావణ్య(Siripuram Lavanya) మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన పార్టీ అధిష్టానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు అనుగుణంగా మహిళా కాంగ్రెస్ బలోపేతానికి  నిరంతర కృషి చేస్తానని పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతాను నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాకు అప్పగించిన బాధ్యతలు పూర్తి న్యాయం చేస్తానని కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళల విధేయతతో పనిచేస్తానని లావణ్య స్పష్టం చేశారు.....

మరిన్ని వార్తలు