విధులు పక్కనపెట్టి.. ఫామ్‌హౌస్‌లో ఫుల్ ఎంజాయ్!
మంచిర్యాల: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే విధి నిర్వహణపై నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు మంచిర్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులకు(Bellampalli One Town Police) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఆన్‌డ్యూటీలో ఉన్నట్లు నమోదై ఉండగానే, కొందరు పోలీసులు ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే వేడుకల(Birthday celebrations)కు హాజరైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ మద్యం మత్తులో పాటలకు అనుగుణంగా చిందులేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
విధి నిర్వహణలో ఉండాల్సిన సమయంలో పార్టీకి వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసుల వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రజలకు క్రమశిక్షణ, చట్ట నిబంధనల గురించి చెప్పాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, వైరల్ వీడియోపై విచారణ చేపడతారా? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఫామ్‌హౌస్‌లో పోలీసుల చిందులు వైరల్‌గా వీడియో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఆన్ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసుకుని.. విధులకు దూరంగా ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. మద్యం మత్తులో పోలీసుల డ్యాన్సులు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Mancherial #Bellampalli #Police #ViralVideo
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 17, 2026