టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు యాత్ర

17-11-2026 | 11:59pm

ఘట్ కేసర్, నవంబర్ 17 (విజయక్రాంతి): కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 29న (ఆదివారం) పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఉప్పల్ డిపో(TGSRTC Uppal Depot) మేనేజర్ ఎల్. రామ్మోహన్, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ఎం. రోహిణిరెడ్డి మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

భక్తులకు ప్రత్యేక పుణ్యక్షేత్రాలు దర్శనం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట లకు నవంబర్ 29న ఉప్పల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరడం జరుగుతుందని, సోమవారం ఉదయం 5 ఆలయాల దర్శనం అనంతరం మంగళవారం ఉదయం హైదరాబాదుకు చేరుకుంటుందని తెలిపారు. బస్సు ప్రయాణ టికెట్ రూ. 3200, దర్శనం టికెట్ రూ. 500, భోజన వసతి సదుపాయాల బాధ్యత ప్రయాణికులదే అన్నారు. బుకింగ్ కొరకు రాజబోయిన రామ్ చందర్ యాదవ్ 8096668766, బాబురావు 9391107302 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ సదవకాశాన్ని భక్తులు వినియోగించుకుని దైవదర్శనం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు