అర్హులందరికీ చేయూత పెన్షన్ మంజూరు

17-11-2026 | 11:35pm

* 625 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు 

* పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్

ముస్తాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అంగన్వాడి కేంద్రాలను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్(District Collector Garima Agrawal) సందర్శించారు. పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. మహిళలు గర్భిణీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఆకుకూరలు,నువ్వులు బెల్లం,మునగ ఆకులు కాయలు ఆహారంలో  భాగంగా అలవాటు చేసుకోవాలని సూచించారు.బందనకల్ గ్రామంలో వ్యవసాయ విధానాన్ని పరిశీలించారు.

అనంతరం ముస్తాబాద్ లో ఏఎం ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన చేయూత కార్యక్రమానికి హాజరై 625 మంది లబ్ధిదారులకు పెన్షన్ అర్హత మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చేయూత పెన్షన్ కోసం ఇప్పటికే దరఖాస్తుదారులు స్వీకరించామని,అర్హుల ఎంపిక కోసం అధికారులతో విచారణ చేయించామని పేర్కొన్నారు.ఈ నెల 18 వ తేదీ వరకు మంజూరు పత్రాలు అందిస్తామన్నారు. 19వ తేదీన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. 

జిల్లా మొత్తంగా 8,209, ముస్తాబాద్ మండలానికి 625 నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.జిల్లాలో 4 వేల వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యాయని తెలిపారు.త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.ఐదు లక్షల విలువైన బీమా వర్తిస్తుందని, అన్ని గ్రామాల్లో నెల రోజుల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.ఇందిరా మహిళా శక్తి చీరలు కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

తదుపరి చీకోడ్ గ్రామానికి వెళ్లి పాఠశాలను తనిఖీ చేశారు.గత ప్రశ్న పత్రాలు సాధన చేస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివి పరీక్షలు బాగా రాయాలని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,మార్కెట్g కమిటీ చైర్మన్ మహేష్ రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నిర్మల, తహసీల్దార్ ఫారుక్,ఎంపీడీఓ లచ్చాలు, బాల్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు,అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు