రష్మిక ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
నవంబర్ 27న రావాల్సిన ‘మైసా’కు బ్రేక్.. కొత్త డేట్ ఎప్పుడంటే?
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన క్రేజీ సాంగ్‌తో మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా విజయశాంతి నటించిన ‘ఓసేయ్ రాములమ్మ’ పాటను రీమిక్స్ చేయడంతో ఈ Song సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్మిక ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తాజాగా షాక్ ఇచ్చారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 27న థియేటర్లలోకి రావాల్సిన ‘మైసా’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి రావాల్సిన రష్మిక సినిమా పోటీ నుంచి తప్పుకున్నట్లయింది.
రిలీజ్ వాయిదాకు మేకర్స్ చెప్పిన కారణం ఇదే!
సినిమాను ప్రేక్షకులకు మరింత అద్భుతమైన అనుభూతిని అందించేలా సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే విడుదల తేదీని మార్చినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. నవంబర్ 27న రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ, మరింత మెరుగైన అనుభూతి కోసం వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు Social Media Post ద్వారా వెల్లడించింది. కొత్త Release Dateను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు. అప్పటివరకు ‘ఓసేయ్ రాములమ్మ’ పాట అభిమానులను అలరిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో రష్మిక అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ‘మైసా’ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది? ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.