టీ ట్రెండ్‌లోకి రజనీకాంత్

28-10-2026 | 02:42pm

నవ్వులు పూయిస్తున్న ‘జైలర్-2’ AI వీడియో!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌(Superstar Rajinikanth)కు ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టీ వీడియోల(Tea video) సరసన ‘జైలర్-2’(Jailer 2) కూడా చేరింది. ఇందులో రజనీకాంత్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో కనిపిస్తూ నవ్వులు పూయిస్తున్నారు.

AI సాయంతో రూపొందించిన ఈ వీడియోలో ముత్తువేల్ పాండ్యన్ టీ తయారు చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే మూర్తి అంకుల్ కారణంగా ఆ ప్రయత్నం కాస్తా ఫన్నీగా మారుతుంది. సాధారణంగా సీరియస్ లుక్‌తో కనిపించే రజనీ పాత్రను ఇలా సరదాగా చూపించడంతో వీడియోకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘జైలర్-2’ హంగామా ఇంకా కొనసాగుతోందని, తలైవా క్రేజ్‌కు ఇదే నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. సినిమా పాత్రలను ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్స్‌తో ముడిపెట్టి రూపొందిస్తున్న AI వీడియోలు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందిస్తున్నాయి. రజనీకాంత్ అభిమానులకు ఈ ఫన్నీ వీడియో మరోసారి ముత్తువేల్ పాండ్యన్ పాత్రను గుర్తుచేస్తోంది. నిజంగా సినిమాలోనూ ఇలాంటి సరదా సన్నివేశాలు ఉంటాయా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.


మరిన్ని వార్తలు