Fauzi నుంచి క్రేజీ అప్డేట్
అసలతనెవరు?.. File No.25లో దాగిన మిస్టరీ ఇదే!
Who Is He?.. Rebel Star సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ హింట్!
రెబల్ స్టార్ ప్రభాస్ #HappyBirthdayPrabhas పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు Fauzi మూవీ టీమ్ ఆసక్తికరమైన అప్డేట్తో సర్ప్రైజ్ ఇచ్చింది. “Who is he?” అంటూ ఇన్నాళ్లూ ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. Declassifying File No.25 పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర ఏంటి? ఆయన లుక్ వెనుక దాగిన రహస్యం ఏమిటి? అనే అంశాలపై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి (Imanvi) నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, చైత్ర ఆచార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మేకర్స్ విడుదల చేసిన File No.25(#Prabhas25) ట్యాగ్‌లైన్‌తో సినిమా కథపై మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా “Who is he?” అనే ప్రశ్న ఈ ప్రాజెక్ట్‌పై Mystery, Suspenseను మరింత పెంచింది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా వస్తున్న ఈ వీడియోలో అసలు ఏం వెల్లడించబోతున్నారు. అభిమానులు ఎదురుచూస్తున్న ఆ రహస్య వ్యక్తి ఎవరు?. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వీడియోలో వెల్లడయ్యే పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటనను చూడాల్సిందే. Prabhas25, Fauzi, HappyBirthdayPrabhas హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ అప్డేట్ సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.