6 September, 2026 | 4:06 PM

అందరికీ నచ్చే రూటెడ్ మూవీ మారెమ్మ

06-09-2026 | 05:35am

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ’మారెమ్మ’తో (Maremma) హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్(Manchala Nagaraj) దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్‌రెడ్డి బండా రు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. రియల్ ఇన్సిడెంట్స్‌తో తీశారు. చాలా రూటెడ్‌గా ఉంది. తెలంగాణ మైసాపురం బ్యాక్‌డ్రాప్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఖచ్చితంగా జనానికి బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. తమ్ముడు మాధవ్ బాగున్నాడు (నవ్వుతూ). తన ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. సెప్టెంబర్ 10న సినిమాను అందరూ చూస్తారని, యంగ్ టాలెంట్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నా” అన్నారు.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి రవితేజను చూసే పెరిగాను. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య. ఈ సినిమాతో అందరికీ పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో ఒక మనిషికి దున్నపోతు ఉన్న హ్యూమన్ ఎమోషన్ చూస్తారు. ఈ సినిమాలో క్యూట్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది” అని చెప్పారు. హీరోయిన్ దీప బాలు మాట్లాడుతూ.. “మాధవ్ ఎంతో క్రమశిక్షణతో అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు.

తనకు చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నా. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది” అని తెలిపింది. డైరెక్టర్ మంచాల నాగరాజు మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’ జాతర మొదలు కాబోతుంది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. 2006 టైమ్‌లైన్‌లో జరిగే స్టోరీ ఇది” అని చెప్పారు. నిర్మాత మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “దర్శకుడు ‘మారెమ్మ’ కథ చెప్పినప్పుడు మా ఊరి కథ అనిపించింది.

అందరూ థియేటర్స్కి వచ్చి చూసి సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నాకు చాలా నమ్మకం ఉంది” అన్నారు. టాలీవుడ్ డైరెక్టర్ హసిత్ గోలి, నటుడు వశిష్ట, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి, గీత రచయిత మిట్టపల్లి సురేందర్, డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి కూడా మాట్లాడారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు