ట్రంప్‌కు బాలయ్య మాస్ ట్రీట్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ‘భగవంత్ కేసరి’(Bhagavanth Kesari Clip) సినిమా సన్నివేశం ఇప్పుడు అనూహ్యంగా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యలకు స్పందించే క్రమంలో జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా(Iran Embassy Social Media) వేదికగా బాలయ్య యాక్షన్ సీన్‌ను ఉపయోగించింది. ఇరాన్ ఎంబసీ తన అధికారిక X ఖాతాలో సుమారు 58 సెకన్ల వీడియోను పోస్టు చేసింది. అందులో బాలకృష్ణ కనిపించే యాక్షన్ సీక్వెన్స్ ఉంది.
ఇరాన్ బలహీనమైన దేశం కాదనే సందేశాన్ని వ్యంగ్య ధోరణిలో చెప్పేందుకు ఈ మూవీ క్లిప్‌ను ఉపయోగించినట్లు ఆ పోస్టు ద్వారా తెలుస్తోంది. ఈ పోస్టు ట్రంప్ ఐక్యరాజ్యసమితి ప్రసంగం(Trump's United Nations speech) తర్వాత వెలువడింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇరాన్ ఎంబసీ తన పోస్టులో ఈ వీడియోను ‘Bollywood’కు సంబంధించినదిగా ప్రస్తావించింది. కానీ వీడియోలో ఉన్నది బాలీవుడ్ సినిమా కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’లోని సన్నివేశం. దీంతో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు.
ట్రంప్ vs ఇరాన్.. మధ్యలో బాలయ్య ‘భగవంత్ కేసరి’!
2023లో విడుదలైన ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ పవర్ఫుల్ యాక్షన్(Balakrishna powerful action) సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే సినిమాలోని ఓ యాక్షన్ క్లిప్ అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న అంతర్జాతీయ రాజకీయ చర్చలో సోషల్ మీడియా రిఫరెన్స్‌గా మారడం టాలీవుడ్‌కు అనూహ్యమైన ప్రచారాన్ని తెచ్చింది. అంతేకాదు.. సాధారణంగా సినిమా ప్రమోషన్లు, ఫ్యాన్ ఎడిట్స్ లేదా సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా వైరల్ అయ్యే మూవీ సన్నివేశం.. ఈసారి అంతర్జాతీయ దౌత్యపరమైన సోషల్ మీడియా పోస్టులో కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ పోస్టును ఆసక్తిగా షేర్ చేస్తున్నారు. ఒక తెలుగు మాస్ సినిమా సీన్.. అంతర్జాతీయ సోషల్ మీడియా చర్చలోకి రావడంతో బాలయ్య ‘భగవంత్ కేసరి’ మరోసారి వార్తల్లో నిలిచింది.