6 September, 2026 | 4:05 PM

తెల్లకాగితం.. అమాయక ప్రేమకథ

06-09-2026 | 05:35am

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి సమర్పణలో హర్ష్ రోషన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. నక్షత్ర హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాతో రమేశ్ బండ్రెడ్డి దర్శకుడిగా (Director Ramesh Bandreddi) పరిచయం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా అక్టోబర్ 2న మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ టీజర్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బాబీ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “జీవితంలో తెలియక అందరూ తప్పులు చేస్తుంటారనే విషయాన్నే ఈ సినిమాతో చెప్పాలనుకున్నారు. అదే తెల్ల కాగితం మీద ఎర్ర మచ్చ పడితే ఎలా ఉంటుందనేదే కథ. ఇదొక ఇన్నోసెంట్ లవ్‌స్టోరీ. 2000 బ్యాక్‌డ్రాప్‌లో నలుగురు మధ్య నడిచే కథ. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్ముతున్నా. ఇప్పుడున్న జనరేషన్ తెల్లటి జీవితంపై ఎర్ర మచ్చ పడకుండా జాగ్రత్త పడాలనేదే ఈ కథ” అన్నారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ “ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. బ్లాక్‌బస్టర్ సినిమాకు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి” అన్నారు. హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. “ఇదొక సినిమా మాత్రమే కాదు.. ఓ మంచి ఫీలింగ్. తెల్ల కాగితం మనందరి కథ. పదోతరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. ఒక ప్యూర్, ఇన్నోసెంట్, ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమాను చూడండి అని చెప్పడం కంటే, ఈ సినిమాను ఫీల్ అవ్వండి అని చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది.

ఎందుకంటే ఇలాంటి సినిమాలు నాకు తెలిసి నేను ఇప్పుడే చేయగలుగుతాను. మళ్లీ ఈ ఏజ్ దాటితే చేయలేను. ఇలాంటి కథ కరెక్ట్ టైమ్‌లోనే వచ్చింది. ఒక ‘7/జీ బృందావన్ కాలనీ’, ఒక ‘ప్రేమిస్తే’.. ఆ కోవకు చెందినదే మన ‘తెల్లకాగితం” అన్నారు. హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. “మా తెల్ల కాగితం’ సినిమాకు అందరూ రిలేట్ అవుతారు. మీ జీవితాల్లో రోజూ చూసేలా సినిమా ఉంటుంది. అక్టోబర్ 2న మా సినిమాను చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా” అని తెలిపింది.

డైరెక్టర్ రమేశ్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. “మన అందరి జీవితాల్లో కొన్ని దశలుంటాయి. అయితే అందరూ మా తెల్ల కాగితం దశను దాటే వచ్చుంటారు. మా కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. బ్లాక్ బస్టర్ తీశామని అనుకుంటున్నాం.. ప్రేక్షకులు కూడా బ్లాక్ బస్టర్ చేస్తారని నమ్ముతున్నాం” అన్నారు. ఇంకా బీవీఎస్ రవి, రామ్ అబ్బరాజు, భాను భోగవరపు, నందు సవిరిగాన, బెక్కెం వేణు గోపాల్, సాయికృష్ణ, డీవోపీ కేవీ గుహన్, నటీనటులు  రఘురాం, రాజ్‌మార్ కసిరెడ్డి, అజయ్, శ్రావ్య తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు