నాచారం డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా వరుణ్‌కాంత్‌రెడ్డి
19-09-2026 | 06:17pm
ఉప్పల్ సెప్టెంబర్ 19 విజయక్రాంతి : నాచారం పోలీస్‌స్టేషన్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా వరుణ్‌కాంత్‌రెడ్డి (Varunkanth Reddy Detective Inspector) బాధ్యతలు స్వీకరించారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆయన నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ప్రాంతంలో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల అక్రమ రవాణా, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని వరుణ్‌కాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు నాచారం డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన మాన్సింగ్ స్థానంలో వరుణ్‌కాంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.