అఖిలపక్ష నాయకులను కలిసిన రైల్వే వంతెన నిర్మాణ పనుల కాంట్రాక్టర్
ఘట్ కేసర్, నవంబర్ 3 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ఘట్ కేసర్ పట్టణ బంద్ లో అఖిలపక్ష నాయకులకు(Leaders of all parties) ఇచ్చిన మాట ప్రకారం రైల్వే వంతెన నిర్మాణ(Construction of a railway bridge) పనుల కాంట్రాక్టర్ సత్తి రెడ్డి మంగళవారం అఖిలపక్ష నాయకులను కలవడం జరిగింది.
అఖిలపక్ష నాయకులతో జరిగిన చర్చల్లో అఖిలపక్ష నాయకుల అభ్యర్థనతో సాధ్యసాధ్యాలను పరిశీలించి రైల్వే వంతెన పనులు ఈసంవత్సరం డిసెంబర్ చివరికల్లా పూర్తి చేసి 26 జనవరి 2027 కి ప్రారంభించేటట్టు చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష నాయకులకు కాంట్రాక్టర్ సత్తిరెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.
చెప్పిన ప్రకారం పనులు పూర్తి చెయ్యకపోతే మా కార్యాచరణను ఉదృతం చేస్తామని కాంట్రాక్టర్ సత్తిరెడ్డి ని హెచ్చరించడం జరిగింది. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో జరిగిన బంద్ సందర్భంగా సహకరించిన ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కి అదేవిధంగా స్వయంగా వచ్చి మాతో చర్చలు జరిపి రైల్వే వంతెన పనులు పూర్తి చేస్తామని మాట ఇచ్చిన కాంట్రాక్టర్ సత్తిరెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.