కేసీఆర్ కు క్రెడిట్ వస్తుందని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు
మేడిగడ్డను సందర్శించిన ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ నాయకులు
మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించి రైతులకు ఎంతో మేలు కలుగజేస్తున్న ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Former Minister Vemula Prashanth Reddy) అన్నారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, బి ఆర్ ఎస్పార్టీ జిల్లా అధ్యక్షులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు పనులు చేతకాక కెసిఆర్ కేటీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
రైతులకు నీళ్లు ఇస్తే కేసీఆర్ కు క్రెడిట్ వస్తుందని భావించిన కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డ నుంచి రైతులకునీళ్లు ఇవ్వకుండా కెసిఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మేడిగడ్డలోని నీరు రైతులకు అందజేసి కాంగ్రెస్ నాయకులు రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హనుమంతు షిండే, బాజిరెడ్డి గోవర్ధన్, కామారెడ్డి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దాదన్న గారి విట్టల్ రావు సందర్శించారు. వారికి స్థానిక బిఆర్ఎస్ నాయకులు పుట్ట మధు స్వాగతం పలికి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించారు.