పేదలకు ఆర్థిక భరోసానిస్తున్న'కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్' పథకాలు

03-11-2026 | 08:41pm
  1. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 
  2. 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

మల్కాజిగిరి, నవంబర్ 3,(విజయక్రాంతి) : 'కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్' పథకాలతో('Kalyana Lakshmi' and 'Shaadi Mubarak' schemes) పేదింటి ఆడ బిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళ వారం మల్కాజిగిరి  ఎమ్మార్వో సుజాతతో కలిసి ఆమె కార్యాలయం వద్ద ఎమ్మెల్యే 49 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడు తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అర్హులైన లబ్ధి దారులకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ మలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఎంతో ఉప యోగకరంగా ఉంటుంద న్నారు. ఈ సంక్షేమ పథకాలు అర్హులైన పేద కుటుంబాలకు సకాలంలో చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా విచారణ పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఈ ఫలాలు అందేలా అధికారులు చూడాలని ఎమ్మెల్యే, అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్ర మంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బద్ధం పరశు రాంరెడ్డి, అమీనుద్దీన్, చిన్నయాదవ్, ప్రభాకర్ గౌడ్, శివగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్రావు, భాగ్యా నంద్, సత్యనారాయణ, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, హేమంత్ పటేల్, మాశెట్టి అనిల్, శ్రీనివాస్, సురేష్, చంద్రమౌళి, మల్లేశ్ చారి, బాల కృష్ణ, విజయ్ రెడ్డి, సుమన్ గౌడ్, సర్వేష్ యాదవ్, నవీన్ రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు