ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం గా ముందుకు

08-10-2026 | 07:50pm

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్

ఘట్ కేసర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు పోతున్నట్లు పోచారం డివిజన్(Pocharam Division) యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్(Youth Congress President Keshapavula Vinod Kumar) పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రి రాజేష్ నేతృత్వంలో ప్రజా పాలనకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ వినోద్ కుమార్ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు అవసరమైన ఆట స్థలాలను శుభ్రం చేయించడం, ప్రజలకు నీటి సౌకర్యం కల్పించేందుకు వాటర్ లైన్ల ఏర్పాటుకు కృషి చేయడం, కాలనీల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయించడం వంటి పలు ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ప్రజల సమస్యే తన సమస్యగా భావిస్తూ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయడంలో వినోద్ కుమార్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వినోద్ కుమార్ ప్రజల మన్నలను పొందుతున్నారు.

మరిన్ని వార్తలు