వినాయక మండపాల వద్ద ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు

15-09-2026 | 07:18pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు(Vinayaka Chavithi Navratri celebrations) సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. యువజన సంఘాల ఆధ్వర్యంలో వినాయక మండపాలను ఏర్పాటు చేసి విగ్నేశ్వరుని విగ్రహాలను అలాగే ఇండ్లలోనే చిన్న మండపాలను నిర్మించి భక్తులు గణపతి విగ్రహాలను ప్రతిష్టించారు.

ఘట్ కేసర్ పట్టణంలో ఆర్కే శివాజీ యూత్ అసోసియేషన్,  ఎస్ఆర్ యూత్ అసోసియేషన్,  ఈడబ్ల్యూఎస్ కాలనీలో యూనివర్సల్ యూత్ అసోసియేషన్, బాలాజీ నగర్ లోని టీం బ్రదర్స్ అలాగే పోచారం డివిజన్ అన్నోజిగూడ లోని సూర్య యూత్ వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల(vinayaka mandapam) వద్ద గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Mallareddy) పాల్గొని బ్రాహ్మనోత్తముల మంత్రోచరణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, డిసిసి కార్యదర్శి మామిండ్ల ముత్యాల్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు పలుగుల మాధవరెడ్డి, రెడ్యానాయక్. మేకల నర్సింగరావు, రేసు లక్ష్మారెడ్డి, ఘట్ కేసర్ రెడ్డి సంఘం అధ్యక్షులు చందుపట్ల వెంకటరెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు