17న మాజీ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

15-09-2026 | 08:13pm

బీఆర్ఎస్ నాయకులు

ఉట్నూర్,(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్(Former CM KCR)  తను అధికారంలో ఉన్న సమయంలో గిరిజనులకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ను  10% పెంచిన  ఘనత కేసిఆర్ కు దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు  మడవి భీమ్ రావు, జాదవ్ లకన్, రాథోడ్ అమూల్, పుర్కా చిత్రు,  కొడపా భీమ్ రావు లు అన్నారు. మంగళవారం   ఇంద్రవెల్లి ఉట్నూర్ మండలాల్లో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీఎంగా కేసీఆర్ విధులు నిర్వహించిన సమయంలో  500 జనాభా తండాలు గూడాలను  గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత  ఆయనకే దక్కుతుందన్నారు. గిరిజనుల కోసం కృషి చేసిన మాజీ సీఎం  కెసిఆర్ కు  ఈనెల  17న పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు  వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొనాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు