గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
చేగుంట,(విజయక్రాంతి): గర్భిణీ స్త్రీలపై డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్(Collector Pratima Singh) వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చేగుంటలోని పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యం ఎలా అందుతుందని అడిగి తెలుసుకున్నారు. రూములు, మెడికల్ స్టోర్ ను, డాక్టర్ల సమయపాలన హాజరు పుస్తకాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. నెలలు నిండుతున్న గర్భిణీలపై(pregnant women) ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హైరిస్కు కేసుల విషయంలో జిల్లా ఆస్పత్రి నుంచి ట్యాగ్ చేయాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి, ఆసుపత్రి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.