ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు

01-11-2026 | 10:11pm

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్

మేడిపల్లి, నవంబర్ 1 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ పరిధిలో గ్రామ పెద్దలు, బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఆదివారం మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy) ముఖ్య అతిథిగా హాజరై, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ లతోపాల్గొని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామానికి బొడ్రాయి రక్షణ కవచం లాంటిదని, గ్రామ దేవతల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఎలాంటి విపత్తులు సంభవించకుండా, పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు గ్రామ ప్రజల ఐక్యతను చాటిచెప్పేలా మహోత్సవాలను వైభవంగా నిర్వహించిన గ్రామ పెద్దలను, బొడ్రాయి కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు