ఓటు రక్షణ ఉద్యమ ర్యాలీకి బయలుదేరిన మాజీ డీసీసీబీ ఛైర్మన్
బాన్సువాడ నుంచి భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..
బాన్సువాడ, నవంబర్ 1 (విజయక్రాంతి): ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓటు రక్షణ ఉద్యమ ర్యాలీ, ఓట్ బచావో దేశ్ బచావో బహిరంగ సభలో పాల్గొనేందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుండి మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి(Former DCCB Chairman Pocharam Bhaskar Reddy) ఆధ్వర్యంలో బారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పే లక్ష్యంతో ఇండియా కూటమి చేపట్టిన ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా బయలుదేరాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది.