సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

29-10-2026 | 04:39pm

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

అల్వాల్, అక్టోబర్ 29,విజయ క్రాంతి: మల్కాజిగిరి నియోజకవర్గంలోని(Malkajgiri Constituency) ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajashekar Reddy) తెలిపారు. మచ్చ బొల్లారం డివిజన్‌లోని ప్రెసిడెన్సీ అవెన్యూలో రూ.16 లక్షల వ్యయంతో  సీసీ రోడ్డు నిర్మాణ పనులను, భూపతిరావు నగర్ కాలనీలో  రూ.16 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ,వజ్ర ఎన్‌క్లేవ్‌లో రూ.22 లక్షల వ్యయంతో  సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం వెంకటేశ్వర్ రెడ్డి, అల్వాల్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్ రవళి, జలమండలి సూపర్‌వైజర్ కృష్ణ, వర్క్ ఇన్‌స్పెక్టర్లు అప్రోజ్, విఘ్నేష్, మాజీ కార్పొరేటర్ శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శోభన్ బాబు, శ్రీధర్ గౌడ్, సురేష్, నర్సింగ్ రావు, సతీష్, భాస్కర్, రాజు, ప్రశాంత్, ఆరిఫ్, వీరేశం, రెహమత్ ఖాన్, రమేష్, కాలనీవాసులు రాజు, పెంటయ్య, దేవేందర్ రెడ్డి, ఠాకూర్ సింగ్, బాల్రాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు