తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి
29-10-2026 | 04:59pm
తలమడుగు అక్టోబర్ 29(విజయక్రాంతి): తలమడుగు మండలాన్ని కరువు మండలంగా(Drought-affected mandal) ప్రకటించాలని మండల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలో పంట దిగుబడులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తలమడుగును కరువు మండలంగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మండల సర్పంచ్‌లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు నారాయణ రెడ్డి,చంటి, ప్రకాష్, లక్ష్మారెడ్డి,సంజీవ్, రాకేష్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.