నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో ఘనంగా వృక్ష మిత్ర కార్యక్రమం

29-09-2026 | 05:43pm

నారాయణఖేడ్, సెప్టెంబర్ 29: పర్యావరణ పరిరక్షణలో భాగంగా నారాయణఖేడ్ డిపోలో(narayankhed depot ) ఈరోజు వృక్ష మిత్ర(vriksha mitra) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వృక్ష మిత్ర వ్యవస్థాపకులు, మాజీ టీ జి ఎస్ ఆర్ టి సి ఎం.వి. రాఘవేంద్రరావు  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంవో  శ్రీ మధుసూదన్, డిప్యూటీ ఆర్ ఎం బివి రావు , డిపో మేనేజర్  వివిస్ సుబ్రహ్మణ్యం, ఎస్టిఐ నందులాల్, ఏఈ ఎం సుగుణాకర్, విజిలెన్స్ హెచ్ సి సత్యనారాయణతో పాటు డిపో సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి ఒక మొక్కను నాటి, దానిని సంరక్షిస్తే పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు  అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు