ఇంటింటికి చేయూత పెన్షన్ల తనిఖీ

29-09-2026 | 05:39pm

బోథ్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో మంగళవారం ఎంపీడీవో ఎల్ రమేష్ చేయూత పెన్షన్(Cheyutha Pension) దరఖాస్తు దారుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఇటీవల చేయూత పెన్షన్ ల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే త్వరలో జాబితా సిద్ధం కానునందున ఇంటింటికి వెళ్లి ఎంపీడీవో ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఆయన వెంట గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు