ఖోడద్ పాఠశాలలో కొత్త వంటశాలలు ప్రారంభించిన సర్పంచ్
29-09-2026 | 06:03pm
తలమడుగు సెప్టెంబర్ 29(విజయక్రాంతి): తలమడుగు మండలంలోని ఖోడద్ ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో(Khodad Primary and ZP High School) రూ.8 లక్షలతో నిర్మించిన నూతన వంటశాల గదులను మంగళవారం సర్పంచ్ ఎముల ప్రియాంక లస్మారెడ్డి, ఎంఈఓ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. దీంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన తయారీకి మెరుగైన సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్, సుభాష్,దత్తు,గంగన్న,ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.