వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక తయారీపై అవగాహన
నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి):వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక(VGPP )(Vikasith Gram Panchayat Plan) తయారీపై పంచాయతీ కార్యదర్శులకు,ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమం నాగిరెడ్డిపేట మండల కార్యాలయంలో నిర్వహించడమైనది.ఈ సందర్భంగా వికాసిత్ తయారీకి నుంచి ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ పలు ముఖ్యమైన సూచనలు చేశారు.
2026 అక్టోబర్ 2వ తేదీలోగా ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు నిర్వహించి వికసిత్ తయారీ ప్రక్రియను పూర్తి చేయాలి.విబి-జి ఆర్ఏఎంజిలో సూచించిన 375 పనుల నుంచి గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేసి వికాసిత్లో చేర్చాలి.వికాసిత్లో పనుల ప్రణాళిక రూపొందించే ముందు ప్రతి గ్రామంలో విలేజ్ రిసోర్స్ మ్యాప్ మరియు విలేజ్ సోషల్ మ్యాప్లను తప్పనిసరిగా సిద్ధం చేయాలి.
గ్రామ ప్రజల అవసరాలు,అందుబాటులో ఉన్న వనరులు,ప్రస్తుత మౌలిక వసతులు మరియు అభివృద్ధి అవసరాలను,కూలీలకు పనులు కల్పించే పనులు పరిగణనలోకి తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికను రూపొందించాలి.
అన్ని గ్రామాలలో నేటి నుండి పనుల గుర్తింపు జరగాలని,అలా గుర్తించిన పనులను అక్టోబర్ 2న గ్రామసభ ఆమోదంతో మండల పరిషత్ కార్యాలయంకి పంపించాల్సి ఉంటుందని సూచించడం అయినది.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గంగాధర్,ఎంపిఓ ప్రభాకర్ చారి,ఏపీఓ సక్కుబాయి ఈసీ సాయిలు,కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.