మేడ్చల్ రోడ్డు, గౌడవెల్లి బ్రిడ్జికి నిధుల మంజూరు!
మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 25(విజయక్రాంతి): మేడ్చల్ రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నుంచి రాయిలాపూర్ వరకు రోడ్డు విస్తరణ పనులకు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. అలాగే గౌడవెల్లి వంతెన నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుంచి రూ.7.40 కోట్లు మంజూరైనట్లు మేడ్చల్ మున్సిపల్ పట్టణ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ తెలిపారు.
ఈ నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేసిన మల్కాజిగిరి బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆమె తన నివాసంలో బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ, మేడ్చల్ రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రాయిలాపూర్ వరకు రోడ్డు విస్తరణకు రూ.6 కోట్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. గౌడవెల్లి వంతెన నిర్మాణానికి రూ.7.40 కోట్లు కేటాయించడంపై గిర్మాపూర్, రాయిలాపూర్ ప్రాంతాల బీజేపీ నాయకులు ఈటల రాజేందర్‌ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు.
రోడ్డు విస్తరణ, వంతెన నిర్మాణ పనులు పూర్తయితే మేడ్చల్ నుంచి రాయిలాపూర్, గౌడవెల్లి ప్రాంతాలకు రాకపోకలు సులభతరమవుతాయని ఆమె అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రాంతీయ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిర్మాపూర్ మాజీ బీజేపీ కౌన్సిలర్ వంగేటి లావణ్య హనుమంతరెడ్డి, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు కొండం ఆంజనేయులు ముదిరాజ్, రాయిలాపూర్ మాజీ సర్పంచ్ బండ నరసింహ, మాజీ ఉపసర్పంచులు వంగేటి రవీందర్‌రెడ్డి, మెట్టు పెంటారెడ్డి, బీజేవైఎం జిల్లా మాజీ కార్యదర్శి బి. రాఘవరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బొక్క మల్లారెడ్డి, చీర్ల సత్యనారాయణ, బొక్క శ్రీనివాస్‌రెడ్డి, వంగేటి హనుమంతరెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి, బొక్క సురేందర్‌రెడ్డి, బండి బాబు గౌడ్, వంగేటి బాబుల్‌రెడ్డి, రాగం ఆనంద్, చంద్రపాల్‌రెడ్డి, బాలరాజ్ చారి, మహేందర్ యాదవ్, తలారి నవీన్ తదితరులు పాల్గొన్నారు