సెంచరీల మోత.. భారత్ భారీ స్కోర్!

25-10-2026 | 05:39pm

భారత్, జింబాబ్వే మహిళల మధ్య జరుగుతున్న రెండో ODIలో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు(India Women) నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ సెంచరీలతో చెలరేగడంతో ప్రత్యర్థి జింబాబ్వే ముందు భారీ లక్ష్యం నిలిచింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ 86 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో అజేయంగా 106 పరుగులు చేసింది. ప్రతీకా రావల్ 67 బంతుల్లో 61 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. మరోవైపు షఫాలీ వర్మ 8, తేజల్ హసబ్నిస్ 3, రిచా ఘోష్ 7 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నొంవెలో సిబాండా 2 వికెట్లు పడగొట్టింది. మిగతా బౌలర్లు భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే జింబాబ్వే 329 పరుగుల లక్ష్యం ఛేదించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు