హైవేలో అండర్ పాస్ లను నిర్మించాలి..

25-10-2026 | 07:03pm

సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్....   

యాదగిరిగుట్ట, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ప్రమాదాల నివారణ కొరకు నేషనల్ హైవే మీద ఉన్నటువంటి చిన్న కందుకూరు, పెద్ద కందుకూరు, బహుపేట, రామజిపేట గ్రామాల వద్ద ఉన్న రోడ్డులో అండర్ పాస్ రోడ్లు నిర్మించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి(CPI District Secretary Yanala Damodar Reddy) డిమాండ్ చేశారు.

ఆదివారం యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూర్ స్టేజి వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న కందుకూర్, పెద్ద కందుకూర్, రామాజీపేట,  బహుపేట గ్రామాలలో నేషనల్ హైవే నుండి గ్రామాలకు వెళ్లే మార్గంలో రోడ్డు దాటి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగి  అనేకమంది మృతి చెందినారని, ఆయా   గ్రామాల స్టేజీల దగ్గర అండర్ పాస్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు,జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ,కొల్లూరి రాజయ్య, యాదగిరిగుట్ట మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, మండల కార్యవర్గ సభ్యులు పేర బోయిన పెంటయ్య, పేర బోయిన బంగారి, నమిలే సంజీవయ్య, బొమ్మలరామారం మండల కార్యదర్శి అన్న బోయిన వెంకటేష్,చిన్న కందుకూర్ ఉపసర్పంచ్ కాటం శ్రీకాంత్, పల్లపు రవి, కల్లేపల్లి శ్రీశైలం, సుబ్బురు పర్వతాలు, రేఖల సాగర్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు