ఎస్ఆర్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం
25-10-2026 | 07:01pm
కరీంనగర్, అక్టోబరు 25 (విజయక్రాంతి): కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగా డీమార్ట్ లైన్లో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్ ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని పొన్నం సాత్విక్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.