మల్లారెడ్డికి ఎమ్మెల్సీ ఓటరు నమోదు పత్రాల సమర్పణ

25-10-2026 | 07:03pm

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 25(విజయక్రాంతి): ఎల్లంపేట్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల(Yellampet, Gundlapochampally Municipality) పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం(Graduate MLC Voter Registration Program) విజయవంతంగా నిర్వహించి వివరాలను మేడ్చల్ శాసన సభ్యులు మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి(Chamakura Malla Reddy) క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్. మాజి సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డిలు అందజేయడం జరిగిందని చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి వారిని అభినందించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు.

మేడ్చల్ నియోజకవర్గంలో బారి ఎత్తున బిఆర్ఎస్ పార్టి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం బారి ఎత్తున జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిఒక్క గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయాలని పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు,మాజి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి.చిన్నోళ్ల భాస్కర్.ఆర్జిత.యూనిస్ పాషా.సురేందర్.గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజి కౌన్సిలర్ లు అమరం జైపాల్ రెడ్డి.బేరీ బాలరాజు.నాయకులు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు