తప్పిపోయిన బాలికను బాలసదనంలో చేర్పించిన పోలీసులు

25-10-2026 | 06:56pm

పటాన్ చెరు: 24, 2026న రాత్రి ఇస్నాపూర్ ఎక్స్‌రోడ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక మైనర్ బాలిక ఉన్నట్లు 112 అత్యవసర నంబర్‌కు సమాచారం అందింది. దీంతో స్పందించిన పటాన్‌చెరు పోలీస్(Patancheru Police) సిబ్బంది అక్కడికి చేరుకుని బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం బాలికను సంగారెడ్డిలోని బాలసదనంలో చేర్పించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక పేరు సోనీ, తండ్రి నాగయ్య. ఆమె వయస్సు 8 సంవత్సరాలు. స్వస్థలం సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం గ్రామం కాగా, ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వైపు నివాసం ఉంటున్నట్లు తెలిసింది. మైనర్ బాలిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆమెను బాలసదనానికి తరలించి సంరక్షణ చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు