ముగిసిన లయన్స్ క్వెస్ట్ ఉపాధ్యాయుల శిక్షణ
ముకరంపుర, అక్టోబర్ 25(విజయక్రాంతి): లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో కరీంనగర్(Karimnagar) లోని మంకమ్మతోట, పారమిత హైస్కూల్లో నిర్వహించిన రెండు రోజుల లయన్స్ క్వెస్ట్ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం(Lions Quest Teacher Training Program) విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల సామాజిక(Student Social), భావోద్వేగ వికాసాన్ని పెంపొందించడంతో పాటు, వారిలో ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ, సత్సంబంధాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సానుకూల ప్రవర్తన వంటి లక్షణాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు(Teachers') అవగాహన కల్పించడం ఈ శిక్షణా కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ మోర భద్రేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారమిత విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఈ. ప్రసాద్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. చిదుర సురేష్ , సెంటెనియల్ చార్టర్ డిస్ట్రిక్ట్ గవర్నర్, జాతీయ శిక్షకురాలు కొండపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు. పోతాని ప్రవీణ్ కుమార్ శిక్షణా కార్యక్రమ సమన్వయ బాధ్యతలు నిర్వహించారు.
శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో పాల్గొన్న ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో లయన్స్ క్వెస్ట్ బోధనా విధానాలను అమలు చేయడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని, ఆచరణాత్మక నైపుణ్యాలను పొందారు. భావోద్వేగ సమతుల్యత, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.