రైతుల పొలాల్లో అధికారుల జులుం

29-09-2026 | 08:19pm

హైకోర్టు స్టే ఆర్డర్ కాపీ బెఖతార్. 

మాగనూరు, సెప్టెంబర్ 29. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం మాగనూరు శివారులోని పోలాల్లో నిర్మించనున్న భారత్ మాల రహదారి(Bharat Mala Road) నిర్మాణ పనులను మంగళవారం స్థానిక రైతులు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భారత్ మాల రహదారి నిర్మాణ భూముల్లో అధికారులు దౌర్జన్యానికి వడిగట్టారు హైకోర్టు స్టే ఆర్డర్ కాపీ బె ఖతార్ చేస్తూ అధికారులు 183,184, సర్వే నంబర్ భూములలో పనులకు ఉపక్రమించారు రైతులు అడ్డుకోవడం జరిగినది.

ఇదే విషయమై బాధ్యత రైతులు స్థానిక తాసిల్దార్ ఎండి అబ్దుల్ రెహమాన్ కు, మరియు మాగనూరు ఎస్సై అశోక్ బాబుకు హైకోర్టు నుండి తీసుకువచ్చిన స్టే ఆర్డర్ కాపీ మరియు పనులు ఆపదలు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెవెన్యూ మరియు ఎన్ హెచ్ ఎ అధికారులు పెద్ద సంఖ్యలో మాగనూరు ,ఉట్కూరు , మక్తల్ ,నారాయణపేట, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి దౌర్జన్యంగా సర్వే చేయడం ఎంతవరకు సమంజసంమన్నారు.

హైకోర్టు నుండి స్టే ఆర్డర్ కాపీలను చూపించిన కూడా పనులను ప్రారంభించడంతో రైతుల, అధికారుల మధ్య తీవ్ర వాగ్వి వాదము జరిగినది. ఎంతసేపటికి రైతులు పనులు జరుగనివ్వక  పోవడంతో సంబంధించిన అధికారులు చేసేది లేక తిరిగి వెళ్ళిపోయారు. రైతులు ముష్టి వెంకటయ్య, ముష్టి రాము, నరహరి, మాట్లాడుతూ మా పొలాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కాకుండా ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ధర ప్రకారము భూములకు డబ్బులని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇవ్వాలని లేనిపక్షంలో ఎంతటి పోరాటకైనా సిద్ధంగా ఉన్నామని రైతులు తెలిపారు.

మరిన్ని వార్తలు