మద్యం సేవించి వాహనాలను నడపవద్దు

28-10-2026 | 09:46pm

నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో నిండు ప్రాణాలే పోతాయి

జవహర్ నగర్ ట్రాఫిక్ సిఐ కే. శివశంకర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో నిండు ప్రాణాలే పోతాయని జవహర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే. శివశంకర్(Jawahar Nagar Traffic CI K. Shivashankar) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లలో మద్యం సేవించి వాహనాలతో పట్టుబడిన వాహనదారులకు ఈ అక్టోబర్ నెలలో 5వ స్పెషల్ ఎం ఎం కోర్టు(కుషాయిగూడ) జరిమానా జైలు శిక్షలను విధించింది.

మొత్తం 71 మంది మద్యం సేవించి వాహనం నడిపిన వినియోగదారులకు జరిమానా రూపంలో రెండు లక్షల 2500, ఒక వ్యక్తికి రెండు వేల రూపాయల జరిమానాతో పాటు గరిష్టంగా 14 రోజులు జైలు శిక్ష ఒక వ్యక్తికి ₹4,000 జరిమానా తో పాటు నాలుగు రోజుల జైలు శిక్షను విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ శివశంకర్ మాట్లాడుతూ వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనం నడపవద్దని వీలైతే మద్యం సేవించని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు డ్రైవింగ్ ఇవ్వండి లేదా వేరే ఇతర ప్రైవేటు వాహనాలను బుక్ చేసుకొని మీ గమ్యస్థానాలకు చేరండని తెలిపారు.

అంతేగాని మద్యం సేవించి ఒక ప్రాంతం నుండి మరియొక ప్రాంతానికి డ్రైవింగ్ చేస్తూ విలువైన జీవితాన్ని రోడ్డు ప్రమాదాలకు బలి పెట్టుకోకండి అని అలాగే అకారణంగా నిర్లక్ష్యం వలన ఇతర వాహనదారులకు పాదాచారులకు యాక్సిడెంట్ చేసి వాళ్ళ మరణాలకు మీరు కారణం కావద్దని వాళ్ళ కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు