మోడీ సహకారంతో డంపింగ్ సమస్యకు... శాశ్వత పరిష్కారం చూపుతా

30-10-2026 | 08:21pm
  1. రాంకీ సంస్థ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి మభ్యపెట్టకు
  2. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్

జవహర్ నగర్ అక్టోబర్ 30 (విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సహకారంతో జవహర్ నగర్ లో ప్రజలకు పొరగాని కొయ్యల తయారైన డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని, రాంకీ సంస్థ ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి మభ్యపెట్టకు అని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్(Malkajgiri MP Etela Rajender) పేర్కొన్నారు.

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో నెలకొని ఉన్న డంపింగ్ యార్డ్ తరలింపు ప్రధాన డిమాండ్ తో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారానికి నాలుగో రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా దమ్మాయిగూడలో నాయకులు ఏర్పాటుచేసిన కార్నర్ పాయింట్లలో నిలబడి మాట్లాడుతూ గత మూడు రోజులుగా చేస్తున్న పాదయాత్రకు రాంకీ యాజమాన్యం భయపడి వాసన వచ్చే పనులు ఆపిందని సువాసనలు వచ్చే స్ప్రేలు కొడుతున్నారని తెలిపారు. మేము వచ్చేటప్పుడు స్ప్రేలు కొట్టుడు కాదు నీకు ఇచ్చిన పనిని సక్కంగా చేయి అని తెలిపారు.

ఇది పార్టీలకు జండాలకు సంబంధంలేని అంశమని డంపింగ్ సమస్య 20 లక్షల మంది ప్రజల బతుకులతో ముడిపడి ఉన్న జీవన్మరణ సమస్య అని తెలిపారు. ఈటల రాజేందర్ పని లేక తిరుగుతున్నాడు అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను చూసి జాలి పడుతున్నామని తెలిపారు. వీళ్ళేనా మా నాయకులు వీరికేనా మా ఓటు వేసింది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని ప్రజలకు ఏ పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన అహసించుకొని ఓటు రూపంలో బుద్ధి చెప్తారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు అఖిలపక్షంగా వెళితే నా అధ్యక్షతన మీటింగ్ పెట్టమని చెప్పి ముఖం చాటేసిన వ్యక్తి ఆ మీటింగును మూన్నాళ్ళ ముచ్చటగానే చేశాడని తెలిపారు.

ఈ మూడు ఏళ్లలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు చెత్త రాకుండా చేస్తామని హామీ ఇచ్చి ముఖం చాటేసారని మీరు చేయడం లేదని నేను రోడ్డుకి ఎక్కాను అని తెలిపారు. డంపింగ్ యార్డ్ చుట్టుపక్కన ప్రాంతాల చెరువులు కాలకూట విషం గా మారాయని, త్రాగే నీటికి ఆవాసమైన ఆ మంచినీరు నేడు కాలకూట విషం గా మారిందని.

ఈ ఘోరాన్ని ఈ తరమే కాక రాబోయే తరాలు క్షమించమన్నారు. క్రాంతి యాజమాన్యం తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మభ్య పెట్టవద్దని ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేసే వరకు మా పోరాటం ఆగదు అన్నారు. ఈ కార్యక్రమంలో, నాగారం దమ్మాయిగూడ ,జవహర్ నగర్ బిజెపి శ్రేణులు, డంపింగ్ బాధితులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు