అథ్లెటిక్స్‌లో సీఆర్పీఎఫ్ విద్యార్థుల సత్తా
సిఆర్పిఎఫ్ స్కూల్ ప్రిన్సిపల్ డి. అపర్ణ
జవహర్ నగర్,(విజయక్రాంతి): జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిఆర్పిఎఫ్ విద్యార్థులు(CRPF students) రాణించడం అభినందనీయమని చదువుతోపాటు క్రీడల్లో బాలబాలికలు నైపుణ్యం సాధించాలని ప్రిన్సిపాల్ డి. అపర్ణ పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో(district athletics competitions) ప్రతిభ చాటిన విద్యార్థులకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ అరుంధతి నగర్ సిఆర్పిఎఫ్ క్యాంపస్ ఆవరణలో గురువారం ప్రిన్సిపాల్ అపర్ణ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ... విద్యార్థులు చిన్నప్పటినుండే మంచి భవిష్యత్తును ఎంచుకొని ముందుకు సాగాలని ఆధునిక కాలంలో ఫోన్లకు స్వస్తి పలుకుతూ క్రీడా మైదానంలోకి అడుగు పెట్టాలని అన్నారు. సిఆర్పిఎఫ్ పాఠశాల క్రమశిక్షణకు నిలయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ క్రీడ పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో 4 బంగారు, 3 వెండి 2 కాంస్య బహుమతులు స్కూల్ క్రీడా ఫెడరేషన్ లో 2 బంగారు 2 సిల్వర్ ఒక బ్రాంజి బహుమతులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ హరిశంకర్, ఆశాజికుమార్, ఫిజికల్ డైరెక్టర్లు రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, మన్మధరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.