సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

25-10-2026 | 06:22pm

​చేగుంట, అక్టోబర్ 25: విజయక్రాంతి : చేగుంట పట్టణ(Chegunta town) కేంద్రంలోని  శ్రీనివాస్ నగర్ కాలనీ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు(CC road construction work) ఎట్టకేలకు మోక్షం లభించింది; ఆదివారం స్థానిక సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ కొబ్బరికాయ కొట్టి పనులను శాస్త్రోక్తంగా ప్రారంభించారు; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, గ్రామ పంచాయతీ పాలకవర్గం(Gram Panchayat Governing Body), సర్పంచ్ ప్రత్యేక చొరవతో నేడు పనులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

వార్డులోని మరో రెండు గల్లీలలో కూడా తదుపరి బడ్జెట్‌లో నిధులు కేటాయించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు; అనంతరం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ మంజీరా పాఠశాల ఉండేదని, నిత్యం వెయ్యి మంది విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన మార్గమైనప్పటికీ ఏళ్ల తరబడి రోడ్డు నిర్మాణం నోచుకోలేదని గుర్తుచేశారు.

అత్యవసర ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ గ్రామమంతటా క్రమపద్ధతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేగుంట మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సండ్రుగు సతీష్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు