జనసంద్రంగా యాదగిరి క్షేత్రం

25-10-2026 | 06:50pm

నేడు శరత్ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చారు.  ఆదివారాలు సెలవు కావడంతో భారీగా భక్తులు(devotees) తరలివచ్చారు. ధర్మదర్శనానికి రెండు  గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో  వేకువ జామున సుప్రభాతం, అభిషేకము అర్చన, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణమును పండితులు వైభవంగా నిర్వహించారు.

సాయంత్రం వెండి జోడి సేవను భక్తులు(devotees) పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ దృశ్య   ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  సోమవారం శరత్ పౌర్ణమి సందర్భంగా సాయంత్రం అద్దాల మంటపంలో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడును ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు