హామీలు అమలు చేయాలని అంబేద్కర్‌కు వినతి
ఘట్ కేసర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి ప్రతి కుటుంబానికి రావలసిన ప్రయోజనాలను అందించే విధంగా పాలకులకు జ్ఞానోదయం కలిగించాలని బిఆర్ఎస్ నాయకులు ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల విఫల పాలనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ల ఆదేశాను సారం ఎనిమిది రోజుల కార్యచరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను ఘట్కేసర్ రైతు సహకార సంఘం బ్యాంకులో సుమారు 1700 మందికి రైతులకి రుణమాఫీ చేయాలని అంబేద్కర్ విగ్రహానికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో నాగులపల్లి రమేష్, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్ బెజ్జంకి హరి ప్రసాదరావు, మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, నాయకులు బద్ధం జగన్మోహన్ రెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, అబ్బవతిని నరసింహ, ఎండి సిరాజ్, నీరుడి శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.