బీసీ గురుకులంలో తీవ్ర విషాదం.. ఆడుకుంటూ విద్యార్థి మృతి

09-09-2026 | 11:07am

రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని(Raghunathapalem) మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాయ్స్ గురుకుల పాఠశాలలో(Mahatma Jyotiba Phule BC Boys Residential School) విషాదం నెలకొంది. గురుకులలో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ బాలుడు మృతి చెందాడు. నివేదికల ప్రకారం, ఈ అకస్మాత్తు మరణానికి గుండెపోటు(Heart attack) కారణమని అనుమానిస్తున్నారు. అయితే, మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదని వైద్యులు తెలిపారు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన హరీష్‌, ప్రియాంక దంపతుల కుమారుడు సాత్విక్‌. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు