భారతీనగర్ క్రీడాకారులకు ఆదర్శ్ రెడ్డి అభినందనలు
పటాన్ చెరు: కోయంబత్తూరులోని నెహ్రూ స్టేడియం(Nehru Stadium)లో నిర్వహించిన 5వ వెటరన్స్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అండ్ గణేష్ నేషనల్ ఛాంపియన్‌షిప్(5th Veterans Sports Athletics and Ganesh National Championship)లో పతకాలు సాధించిన భారతీనగర్ డివిజన్ క్రీడాకారులను పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్(BRS) పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి అభినందించారు.
ఈ పోటీల్లో 95 ఏళ్ల వెంకట్ రామయ్య హామర్ త్రోలో స్వర్ణ పతకం సాధించగా, శామ్యూల్ రజత పతకం, దేవేంద్ర చారి, బలయ్య, పాటి సత్యనారాయణ, సంధ్య కాంస్య పతకాలు సాధించారు. ఇతర క్రీడాకారులు కూడా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, వయస్సు క్రీడలకు అడ్డంకి కాదని, 95 ఏళ్ల వయస్సులో వెంకట్ రామయ్య స్వర్ణ పతకం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.