సాయన్న పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) తంగళ్లపల్లి మండలం సారాంపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి(Panduga Sayanna Jayanti)ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు మాట్లాడుతూ... పండుగ సాయన్న పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాయన్న చరిత్రను గుర్తిస్తూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుండి పరుశురాం, ఫిషరీస్ డైరెక్టర్ కూనవేని పరుశురాంతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.