ఆదిత్య బిర్లా గోల్డ్ లోన్ ప్రత్యేక బ్రాంచ్ ప్రారంభం

22-10-2026 | 10:29pm

శంషాబాద్: భారతదేశంలోని ప్రముఖ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలలో ఒకటైన ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్(Aditya Birla Capital Limited) ఎన్‌ఎఫ్‌బీసీ (NBFC) వ్యాపారం, శంషాబాద్‌లో ప్రత్యేక బ్రాంచ్‌ను ప్రారంభించడం ద్వారా గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు ఇవాళ ప్రకటించింది.

ఈ ప్రారంభం ఆదిత్య బిర్లా క్యాపిటల్ సమగ్ర ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియోలో ఒక ముఖ్యమైన అడుగు కాగా, కస్టమర్‌లకు పారదర్శకమైన, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన గోల్డ్-బ్యాక్డ్ క్రెడిట్‌ను అందించాలనే సంస్థ నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుంది. తెలంగాణ వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్‌కు అధిక సంభావ్యత ఉన్న ప్రాంతంగా ఎదుగుతోంది. క్రిఫ్ హై మార్క్  ప్రకారం, 2026 మార్చి నాటికి రాష్ట్రంలో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ రూ. 1.61 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 70.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇక్కడి బలమైన కస్టమర్ బేస్ మరియు లాంఛనప్రాయమైన సెక్యూర్డ్ క్రెడిట్‌కు పెరుగుతున్న డిమాండ్.. వ్యవస్థీకృత రుణదాతలకు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, మంచి కనెక్టివిటీ కలిగి ఉండటం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం మరియు పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతుండటం వంటి కారణాల వల్ల శంషాబాద్ ప్రాంతం.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ తన తొలి విడత విస్తరణకు అనువైన వ్యూహాత్మక మార్కెట్‌గా నిలిచింది. 

నమ్మకం మరియు పారదర్శకత ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిత్య బిర్లా క్యాపిటల్ గోల్డ్ లోన్ సర్వీస్.. ప్రత్యేక బ్రాంచ్ ఆధారిత సేవా విధానాన్ని డిజిటల్ సౌలభ్యంతో అనుసంధానించింది. ఈ సేవలు పారదర్శకమైన ధరలు, తాకట్టు పెట్టిన ఆభరణాల సురక్షితమైన నిర్వహణ మరియు పట్టణ, సెమీ అర్బన్ మార్కెట్లలోని వివిధ వర్గాల కస్టమర్ల కోసం సరళతరమైన రుణ ప్రయాణాన్ని అందిస్తాయి. 2027 మార్చి నాటికి మంచి డిమాండ్ ఉన్న మార్కెట్లలో 200 నుండి 300 ప్రత్యేక గోల్డ్ లోన్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలనే కంపెనీ విస్తృత ప్రణాళికలో భాగంగా ఈ విస్తరణ చేపడుతున్నారు.

ఈ ప్రారంభం గురించి ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఎన్‌ఎఫ్‌బీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాకేష్ సింగ్ మాట్లాడుతూ, "కస్టమర్లకు సులభమైన మరియు సురక్షితమైన ఆర్థిక పరిష్కారాలను విస్తృతం చేయడంలో మా గోల్డ్ లోన్ వ్యాపార ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. బలమైన కనెక్టివిటీ, పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు మరియు హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం వంటి కారణాల వల్ల శంషాబాద్ ఎంతో అనుకూలమైన ప్రాంతంగా ఉంది.

ఇది మా గోల్డ్ లోన్ వ్యాపారానికి ఒక కీలకమైన వృద్ధి మార్కెట్‌గా మారుతుంది. మేము మా ఉనికిని విస్తరిస్తున్న కొద్దీ, ఫిజికల్ మరియు డిజిటల్ ఛానెల్‌ల ద్వారా పారదర్శకమైన మరియు సులభమైన అనుభవంతో గోల్డ్ లోన్‌లను మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

శంషాబాద్‌లోని పట్టణ మరియు సెమీ అర్బన్ మార్కెట్లలోని వివిధ వర్గాల కస్టమర్ల అవసరాలను ఆదిత్య బిర్లా క్యాపిటల్ గోల్డ్ లోన్ సేవలు తీరుస్తాయి. అదే సమయంలో కంపెనీ వైవిధ్యమైన ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియోను ఇది మరింత బలపరుస్తుంది. ఏబీసీఎల్, దాని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్‌లకు దేశవ్యాప్తంగా 1,759కి పైగా బ్రాంచ్‌ల నెట్‌వర్క్ ఉంది. 2026 జూన్ 30 నాటికి వాటి ఏకీకృత లెండింగ్ బుక్ రూ.2.19 లక్షల కోట్లను దాటింది.

మరిన్ని వార్తలు