ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు
ఎమ్మెల్యే టీఆర్ఆర్
మహబూబ్నగర్: మహమ్మదాబాద్, గండీడ్ మండలాల ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులు(SC Cell Presidents)గా బాల్రాజ్, చెన్నారం దస్తయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి(MLA Dr. T. Rammohan Reddy) చేతుల మీదుగా వారు నియామక పత్రాలను అందుకున్నారు. పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నూతన అధ్యక్షులు బాల్రాజ్, దస్తయ్య ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జె.రాంలాల్, ఉప సర్పంచి పవన్ కుమార్, జితేందర్ రెడ్డి, శాంతిరంగ్యా, అనంతయ్య గుప్తా, దశరథ్ గౌడ్, టైగర్ రవీందర్, తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.